ఎన్నికలు: వార్తలు

యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 

'చాయ్ పే చర్చా' కార్యక్రమం జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 

కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

29 May 2023

టర్కీ

టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక 

టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు.

17 Apr 2023

కర్ణాటక

కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.

15 Apr 2023

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది.

10 Apr 2023

కర్ణాటక

అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.

29 Mar 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.

29 Mar 2023

కర్ణాటక

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

11 Mar 2023

బీజేపీ

రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.

2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు

భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.