Page Loader
J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం
జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఇవి పీర్ పంజాల్ పర్వత శ్రేణి రెండువైపులా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒమర్ అబ్దుల్లా గండేర్‌బల్, బడ్‌గామ్ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. హమీద్ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గం నుండి, రవీందర్ రైనా నౌషేరా స్థానం నుండి పోటీ పడుతున్నారు.

వివరాలు 

అక్టోబర్‌ 8న  ఫలితాలు 

ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది, వీటిలో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నెల 18న జరిగిన తొలి దశ పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్‌ నమోదైంది. మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్ అక్టోబర్‌ 1న జరగనుంది. ఫలితాలు అక్టోబర్‌ 8న వెలువడనున్నాయి.