తదుపరి వార్తా కథనం

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఎంత మంది వేశారంటే..?
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 25, 2024
06:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏప్రిల్ 26, 2024న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు ఏప్రిల్ 29. మే 13న ఎన్నికలు నిర్వహించి జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు మొత్తం 600 నామినేషన్లు దాఖలు కాగా, 175 అసెంబ్లీ స్థానాలకు 3,300 నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు