Elections In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం.. కౌంటింగ్‌పై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 3) పది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కఠిన పోటీ నెలకొంది. అధికార పార్టీ తన సీట్లను కాపాడుకునేందుకు, ప్రతిపక్ష టీడీపీ గెలుపు సాధించేందుకు వ్యూహాత్మకంగా పని చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్‌లలో డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనుండగా, నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగుతున్నాయి.
అదే విధంగా బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
Details
ముమ్మర ఏర్పాట్లు చేసిన అధికారులు
ఈ నేపథ్యంలో అధికార వైసీపీ తన సభ్యులను క్రమశిక్షణతో కొనసాగించేందుకు విప్ జారీ చేసింది. పార్టీలో విప్‌ను ధిక్కరించరాదని కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చింది.
విప్‌ను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇక టీడీపీ కూడా ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది.
పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, అభ్యర్థులకు లొంగదీసుకునేందుకు విస్తృతంగా ప్రలోభాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కొక్క చోట ఘర్షణలు చెలరేగే అవకాశముండటంతో, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, అధికార యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.