Lok Sabha Election 2024 2nd Phase Voting:లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్.. అత్యంత సంపన్న అభ్యర్థులు వీరే..
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు లోక్‌సభ రెండో విడత ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదలైంది.
Lok Sabha Election 2024 Phase 2: 5 అత్యంత ధనవంతులైన అభ్యర్థులు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)నివేదిక ప్రకారం,'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణ గౌడకు రూ.622 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. ఈయన కర్ణాటక డిప్యూటీ సీఎం సోదరుడు. మథుర లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని ఆస్తులు రూ. 278 కోట్లు.ఈమె మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించి నాలుగో స్థానంలో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మొత్తం ఆస్తులు రూ.217.21కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు.
Phase 2 Election 2024: అత్యల్ప ఆస్తులు కలిగిన 5 మంది అభ్యర్థులు
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. అతని పోల్ అఫిడవిట్ ప్రకారం, అతను ₹ 500 విలువైన ఆస్తులను ప్రకటించాడు. పాటిల్ తర్వాత మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్, కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్నారు .ఆమె ₹ 1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు .ఆయన మొత్తం ఆస్తులు ₹ 1,400.
Phase 2 Polls 2024: సున్నా ఆస్తులు అభ్యర్థులు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో ₹ 2,000 ఆస్తులను ప్రకటించారు. కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేసిన VP కొచుమోన్ ₹ 2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. కర్ణాటకకు చెందిన ప్రకాష్ ఆర్‌ఎ జైన్, రామ్‌మూర్తి ఎం, రాజా రెడ్డిలకు అసలు ఆస్తులు లేవు.సున్నా ఆస్తులు లేని మరో ముగ్గురు అభ్యర్థులు మహారాష్ట్రకు చెందినవారు. కిషోర్ భీమ్‌రావ్ లబాడే, నగేష్ శంభాజీ గైక్వాడ్, జ్ఞానేశ్వర్ రావుసాహెబ్ కపటే. రెండో దశ లో కేరళ, రాజస్థాన్, త్రిపురలో పోలింగ్ ముగియనుంది.