ఎన్నికలు: వార్తలు
ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.
One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.
Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
తైవాన్ అధ్యక్ష పదవికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ సోమవారం ప్రకటించారు.
కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ
తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్
2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం
దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం అందుకు రంగం సిద్ధం చేస్తోంది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం
పాకిస్తాన్ 15వ నేషనల్ అసెంబ్లీ రద్దు అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సభను రద్దు చేశారు. 3 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది.
అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.
Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్
బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.
పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి
పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.
West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభం: ఈసీ
రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్‌లైన్ మోడ్‌లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అగ్రనేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరోసారి తన మామకు షాకిచ్చారు.
10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు
గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.
న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు
మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 0.1శాతం క్షీణించిన నేపథ్యంలో సాంకేతికంగా న్యూజిలాండ్ మాంద్యంలోకి ప్రవేశించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్ సీజే
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.
'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది.
యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్
'చాయ్ పే చర్చా' కార్యక్రమం జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం
కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక
టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు.
కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది.
అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు
కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.
బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్
బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.
నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.
2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు
భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.