రాజస్థాన్ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ తెలిపారు.
గెహ్లాట్, పైలట్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం దిల్లీకి పిలుపించుకున్నారు.
ఇద్దరితో విడివిడిగా చర్చించారు. అనంతరం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు.
దాదాపు నాలుగు గంటల చర్చల అనంతరం ఇద్దరు కలిసి పని చేస్తామనే ఒప్పందానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియి.
దిల్లీ
కర్ణాటక ఫలితాల స్ఫూర్తితో చేతుల కలిపిన నేతలు
అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చాలనే విషయాన్ని మాత్రం అధిష్టానం వెల్లడించలేదు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఏం చేయాలనే నిర్ణయాన్ని మాత్రం ఇద్దరు నేతలు అధిష్టానానికే వదిలేసినట్లు కెసి వేణుగోపాల్ తెలిపారు.
రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా ఉండటంతో అధిష్టానం అలర్ట్ అయ్యింది.
అందుకే ఎన్నికల సమయం దగ్గర పడటంతో నివారణ చర్యలను చేపట్టింది.
కర్ణాటకలో సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య జరిగిన శాంతి ఒప్పందం వల్ల జరిగిన ఫలితాల నుంచి గెహ్లాట్, పైలెట్ ప్రేరణ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజస్థాన్
అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు
గత కొన్ని సంవత్సరాలుగా, అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇటీవల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలెట్ దీక్ష కూడా చేశారు.
రాష్ట్రంలో బీజేపీ పాలనలో జరిగిన పేపర్ లీక్ స్కామ్‌పై చర్య తీసుకోవాలని సొంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాశారు.
అంతేకాదు రాష్ట్రంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ సంఘర్ష్ యాత్రను సచిన్ ప్రారంభించారు.
ఎన్నికల వేళ, ఈ వివాదానికి చెక్ పెట్టకుంటే, మరింత ముదిరే అవకాశం ఉందని, అది పార్టీ నష్టాన్ని కగిలిస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇద్దరి నేతలతో చర్చలు జరిపింది.