Page Loader
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు

వ్రాసిన వారు Stalin
Mar 13, 2023
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. తెలంగాణలో హైదరాబాద్-రంగా‌రెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండు రాష్ట్రాల్లో ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఒంగోలులో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం సెయింట్ థెరిస్సా స్కూల్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంఘటనా స్థలానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 16న రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.