హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థిని ఏఐఎంఐఎం ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్‌ను రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు.
రహ్మత్ బేగ్ చాలా కాలంగా ఏఐఎంఐఎంతో కొనసాగుతున్నారు. గతంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.
హైదరాబాద్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్‌ఎస్ మద్దతు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ముందుగా తమకు సీటు కేటాయించాలని, మద్దతు ప్రకటించాలని ఎంఐఎం అభ్యర్థించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్లతో చర్చించి ఎంఐఎం అభ్యర్థికి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో ఉపాధ్యాయ వర్గం, హైదరాబాద్ స్థానిక సంస్థల పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
2017లో కూడా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికే సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించారు.