ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మార్చి 13న పోలింగ్ నిర్వహించి, మార్చి 16న కౌంటింగ్, ఫలితాల ప్రకటన వెలువడనుంది.
అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రాజకీయ పార్టీలు
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయల పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి.