LOADING...
ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు
అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. క్రీడా సామగ్రి కొనుగోలు, క్రీడాకారులకు సర్టిఫికెట్ల జారీ వంటి ఇతర పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి శాప్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అవినీతితో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్.ప్రభాకర్ రెడ్డిపై ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్

సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌కు అదనపు బాధ్యతలు

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌కె హర్షవర్ధన్‌కు శాప్ వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాప్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయని సాప్‌కు చెందిన ముగ్గురు పాలకమండలి సభ్యులు కె నరసింహులు, డేనియల్ ప్రదీప్, కె వరలక్ష్మి ఇటీలవ ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం కప్ టోర్నీ కూడా ఆలస్యంగా జరగడంతోపాటు క్రీడాకారులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జారీలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు ప్రభాకర్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.