Page Loader
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!

వ్రాసిన వారు Stalin
Feb 08, 2023
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. గుండెలోని రెండు వాల్వ్‌లలో రక్తం గడ్డకట్టినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించారు.

ఉదయగిరి

చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడం ఇదే తొలిసారి కాదు

మేకపాటికి గుండెపోటు రావడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు మేకపాటికి గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆస్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మూడు రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మేకపాటి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 2019లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మేకపాటి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. వైఎస్సార్‌సీపీలో అంతర్గత విభేదాలపై వ్యాఖ్యానించిన ఆయన ఉదయగిరిలో పార్టీ సమన్వయకర్త నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.