ఆరోగ్యం: బాదం, కాజు, వాల్నట్ వంటి గుండెకు మేలు చేసే గింజల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా గింజలను తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. గింజల్లో అన్ సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బాదం, కాజు, వాల్నట్ వంటి గింజలను సాయంత్రం స్నాక్స్ లాగా తినవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఐతే గింజల్లోని ఒక్క లోపం ఏంటంటే, వీటిని అతిగా తినకూడదు. కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడమే ఉత్తమం.
గింజల వల్ల గుండెకు జరిగే మేలు ఏంటి?
తరచుగా గింజలను తినడం వల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
గింజల వల్ల గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. రక్తప్రసరణ పెరగకుండా గింజల్లోని పోషకాలు నియంత్రిస్తాయి. గుండె సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం
గింజల్లోని ఏ పోషకాలు గుండెకు మేలు చేస్తాయి
గింజల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె నుండి శరీరానికి, శరీరం నుండి గుండెకు వచ్చే రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది మంచికొవ్వు కావడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. హార్ట్ అటాక్ వంటి గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తవు.
గింజల్లో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మీరు కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ తినకుండా ఉంటారు. ఐతే గింజలను వారంలో 4-6సార్ల కంటే ఎక్కువ తినకూడదు. ఇది చిన్నపిల్లలకు వర్తించదు.
అది కూడా ఉప్పు లేకుండా, ఎలాంటి మసాలాలు జల్లుకోకుండా తినాలని గురుంచుకోండి.