NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి
    గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బీట్ రూట్ ప్రయోజనాలు

    ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 11, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీట్ రూట్ ని పెద్దగా పట్టించుకోని వారు దానివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇప్పుడే తెలుసుకోండి. బీట్ రూట్ లో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

    అంతేకాదు ఇందులో మాంగనీస్ అనే ఖనిజ పోషకం ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది.

    ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధితో బాధపడే వారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. కావాల్సినంత ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా చూసుకుంటుంది.

    ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెరుగు, పప్పులు, విత్తనాలతో కలిపి బీట్ రూట్ ని తింటే భోజనంలో గ్లిసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.

    ఆహారం

    బీట్ రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

    గ్లిసమిక్ ఇండెక్స్ తగ్గడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

    బీటాలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో అనవసర నొప్పులు, వాపులు ఏర్పడవు. ఇంకా ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణాశయ పనితీరు మెరుగుపడుతుంది.

    ఇందులోని నైట్రేట్ అనే పోషకం వల్ల మెదడును చేరే రక్తప్రవాహం పెరుగుతుంది. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా విస్తారంగా మారతాయి.

    కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో బీట్ రూట్ ని చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

    బీట్ రూట్ ని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా జ్యూస్ తాగినా బాగుంటుంది. ఇంకా వీటిని ఎంచకా పెనం మీద వేయించి, రుచికోసం కొంత ఉప్పు వేసి కూడా తినవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బరువు తగ్గడం
    గుండెపోటు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    బరువు తగ్గడం

    బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు లైఫ్-స్టైల్
    2023: కొత్త సంవత్సరంలో కొత్త అలవాట్లు.. మీ డైలీ డైట్ కి వీటిని జోడించండి ఆరోగ్యకరమైన ఆహారం
    చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు గుండెపోటు
    బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం

    గుండెపోటు

    వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు లైఫ్-స్టైల్
    ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఆరోగ్యకరమైన ఆహారం
    రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025