Loading...
Rafale Marin: ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్..  
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్..

Rafale Marin: ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ ల్యాండింగ్..  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. దేశీయంగా నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత నౌకాదళంలో ఈ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది కీలక ముందడుగుగా నిలిచింది. విమానాన్ని నౌకాదళంలోకి తీసుకొచ్చే ముందు ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై కార్యకలాపాలకు అనుగుణంగా దాని పనితీరును పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గోవాలో రఫేల్ మెరైన్ విమాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమాన వాహక నౌక నుంచి యుద్ధ విమానాన్ని సురక్షితంగా నడపడానికి అవసరమైన మార్పులు, సాంకేతిక అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

వివరాలు 

భారత్‌-ఫ్రాన్స్ మధ్య రూ.63 వేల కోట్ల ఒప్పందం

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో రఫేల్ మెరైన్ అనుకూలతను నిర్ధారించడంతో పాటు భవిష్యత్తులో మోహరింపునకు సిద్ధం చేయడం ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం.

ఇందుకోసం అవసరమైన కార్యకలాపాలపై భారత నౌకాదళం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

భారత నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు మరో 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు గతేడాది ఫ్రాన్స్ ప్రభుత్వంతో సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు 

భారత్‌-ఫ్రాన్స్ మధ్య రూ.63 వేల కోట్ల ఒప్పందం

ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీట్ యుద్ధ విమానాలు, నాలుగు ట్విన్ సీట్ శిక్షణ విమానాలు ఉన్నాయి.

వీటితో పాటు అవసరమైన ఆయుధాలు, సిమ్యులేటర్లు, పైలట్ల శిక్షణ, ఇతర అనుబంధ పరికరాలు, లాజిస్టిక్స్ మద్దతును కూడా ఒప్పందంలో భాగంగా అందించనున్నారు.

2030 నాటికి మొత్తం విమానాల సరఫరాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ యుద్ధ విమానాలను నడిపే పైలట్లకు భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నాయి.

ఈ విమానాలు నౌకాదళంలో చేరితే సముద్ర జలాల్లో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ విజయవంతమైన ల్యాండింగ్..  

ADVERTISEMENT