చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు
శరీరంలో చెడు కొవ్వు పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. ముందుగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు చూద్దాం. గుండెకు శరీరానికి రక్తాన్ని సరఫరా రక్తనాళాల్లో రక్తం పేరుకుపోవడం వల్ల గుండెకు ఆక్సిజన్ అందదు. అప్పుడు గుండె పనితీరులో మార్పు వస్తుంది. ఈ మార్పులు గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది. సాధారణంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీరంలో నడుము కింది భాగం ఎక్కువ ప్రభావానికి లోనవుతుంది. కాళ్ళు తిమ్మిరెక్కడం, కాలిగోర్లు పెరగకపోవడం, కాలిగోర్ల మీద మచ్చలు, కాలి చర్మం రంగులో మార్పులు రావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినపుడు అలర్ట్ అవడం మంచిది.
కొవ్వు పెరగకుండా ఏం చేయాలంటే..?
చెడుకొవ్వు పెరగకుండా ఉండాలంటే రోజువారి దినచర్యలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను ముట్టుకోవద్దు. ఓమెగా 3 కొవ్వు ఉండే ఆహారాలైన సాల్మన్ చేప, అవిసె గింజలను తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రోటీన్ కలిగి ఉండే కూరగాయలు తినాలి. పొగతాగడం మానుకోవాలి. మద్యం తాగే అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందుగా బరువు తగ్గడం మీద ఫోకస్ పెట్టాలి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. కనీసం 45నిమిషాల వ్యాయామం అవసరం. యోగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఉప్పు ఎక్కువైతే రక్తనాళాళ్ళో ఇబ్బందులు తలెత్తుతాయి. అది గుండె సంబంధ ఇబ్బందులకు దారి తీస్తుంది.