Page Loader
ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

వ్రాసిన వారు Stalin
Feb 08, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను నియోజక‌వర్గంలో అనేక సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. తనను తిట్టడమే కొందరు వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలన్నారు.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

అధికారులు సహకరించడం లేదు: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను చూసిన సీఎం జగన్ రూ.28కోట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇంతవరకు ఆ నిధులను విడుదల చేయలని చెప్పారు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠాశాల ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. వావిలేటుపాడులో 3వేల మందికి ఇచ్చిన ఇళ్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలోనే నిలిచిపోయాయని, నియోజకవర్గంలో అధికారులు సహకరించడం లేదని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.