Page Loader
దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ

దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ

వ్రాసిన వారు Stalin
Feb 08, 2023
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు, తాజాగా అతనిని హైదరబాద్‌లో అరెస్టు చేశారు. బుచ్చిబాబును నేరుగా దిల్లీకి తీసుకెళ్లి రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో సీబీఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కోర్టు అనుమితితో బుచ్చిబాబును విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనున్నారు. గతంలోనూ విచారణ కోసం బుచ్చిబాబును సీబీఐ అధికారులు దిల్లీకి పిలిపించారు.

లిక్కర్ స్కామ్

స్కామ్ లో బుచ్చిబాబు కీలకమని భావిస్తున్న సీబీఐ

కల్వకుంట్ల కవిత, శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌.. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్‌నాయర్‌కు రూ. రూ.100 కోట్ల ముడుపులను అందజేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్‌ నేతలతో కుదిరిన ఒప్పందం వల్ల.. కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌కు అవాంఛిత ప్రయోజనాలు చేకూరినట్లు ఈడీ మొదటి చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. అయితే దిల్లీ లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. దిల్లీ లిక్కర్ డీల్ జరిగినప్పుడు సౌత్ గ్రూప్ అడిటర్‌గా బుచ్చిబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ లిక్కర్ వ్యాపార్ రామచంద్ర పిళ్లైకి కూడా బుచ్చిబాబు ఆడిటర్‌గా ఉండటం గమనార్హం.