దిల్లీ లిక్కర్ స్కామ్: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ ఆప్‌కి చెందిన సాధారణ కార్యకర్త కాదని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన డబ్బులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించినట్లు చెప్పింది. అయితే ఈ చార్జ్ షీట్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నిందితుడిని పేర్కొనలేదు.
ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ మొత్తం కల్పితం: కేజ్రీవాల్
ఈడీ చార్జ్‌షీట్‌లో తన పేరు ఉండటంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం లేదన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడానికి పనిచేస్తోందని ఆరోపించారు. ఈడీ ఇప్పటి వరకు 5000లకు పైగా చార్జ్‌షీట్లు దాఖలు చేసిందని, అందులో ఎంతమందికి శిక్ష పడిందో చెప్పాలన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ మొత్తం కల్పితమనన్నారు. కల్వకుంట్ల కవిత, శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్.. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్‌నాయర్‌కు రూ. రూ.100 కోట్ల ముడుపులను అందజేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్ నేతలతో కుదిరిన ఒప్పందం వల్ల.. కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌కు అవాంఛిత ప్రయోజనాలు చేకూరినట్లు ఈడీ మొదటి చార్జ్‌షీట్‌లో ఆరోపించింది.