Page Loader
దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు
ఈడీ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు

దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు

వ్రాసిన వారు Stalin
Dec 21, 2022
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోనూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్లు ఉన్నాయి. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ చేర్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్‌ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్‌నాయర్‌, బోయినపల్లి అభిషేక్‌ అరెస్టయ్యారు. ఈ నేఫథ్యంలో వారి నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈడీ ఈ తాజా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో అభిషేక్‌, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైలు, కవిత పాత్రల గురించి తాజా నివేదికలో ఈడీ చెప్పింది.

లిక్కర్

కవిత ఇంట్లో సమావేశం..

కల్వకుంట్ల కవిత, శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌.. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్‌నాయర్‌కు రూ. రూ.100 కోట్ల ముడుపులను అందజేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్‌ నేతలతో కుదిరిన ఒప్పందం వల్ల.. కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌కు అవాంఛిత ప్రయోజనాలు చేకూరినట్లు ఈడీ చెప్పింది. 2022 జనవరిలో కవితతో హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సమీర్‌ సమావేశమైనట్లు, అందులో శరత్‌చంద్రారెడ్డి, అరుణ్‌పిళ్లై, అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ కూడా ఉన్నట్లు ఈడీ తన అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ‌సందర్భంగా అరుణ్‌పిళ్లై తమ కుటుంబ సభ్యుడిలాంటివారని, ఆయనతో వ్యాపారం చేయడం అంటే తనతో వ్యాపారం చేయడమేనని కవిత హామీ ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది.