దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం ఏడుగురిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఐదుగురికి ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి చెందిన వారికి.. ఈ కేసుతో సంబంధం ఉండటంతో.. తెలుగు నాట వార్త సంచలనంగా మారింది.
జనవరి 5న మరో ఛార్జ్ షీట్
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న..నిందితుల రిమాండ్ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందుకు.. నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్ రిమాండ్ పొడిగించాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. దీంతో ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్‌ను కోర్టు పెంచింది. ఇదిలా ఉంటే. ఈ కేసులో జనవరి 5న మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి ఛార్జ్ షీట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తామని ఈడీ చెప్పింది. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు కోర్టు వివరించారు అధికారులు.