Page Loader
యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 
యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గేట్

యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్ 

వ్రాసిన వారు Stalin
May 30, 2023
06:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

'చాయ్ పే చర్చా' కార్యక్రమం జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు బీజేపీ అలాంటి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.'ఖానే పే చర్చా' కార్యక్రమం పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది. దీనికి ఉత్తర్‌ప్రదేశ్ వేదికైంది. 'ఖానే పే చర్చా'ను మంగళవారం ( మే 30) యూపీలో మొదలైన 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తైన నేపథ్యం మాత్రమే కాకుండా, 2024లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ 'ఖానే పే చర్చా' కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ సభ్యులు, పార్టీ కార్యనిర్వాహకులందరూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే 'ఖానే పే చర్చా' కార్యక్రమంలో పాల్గొనున్నారు.

 యూపీ

అన్ని లోక్‌సభ స్థానాల్లో ర్యాలీలు

కేంద్రంలో తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వాన్ని హైలైట్ చేయడానికి, యోగి ప్రభుత్వ హయాంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులను కూడా హైలైట్ చేయడానికి సుమారు 600మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మొత్తం 80 లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ పాలనను ప్రధానంగా ప్రమోట్ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం చేయడమే కాకుండా, జూన్ 10 నుచి జూన్ 20 మధ్య అన్ని లోక్‌సభ స్థానాల్లో ర్యాలీలను ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీల్లో అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు పాల్గొననున్నారు.