NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 
    భారతదేశం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 16, 2023 | 06:00 am 0 నిమి చదవండి
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంల తనిఖీలు చేయాలని ఈసీ ఆదేశం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) మొదటి స్థాయి తనిఖీలను ప్రారంభించాలని రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈసీ అధికారికంగా షురూ చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను చర్చించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌తో జరిగిన సమావేశంలో ఈసీఐ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఈసీఐ బృందం చేర్పులు, తొలగింపులతో సహా ఎలక్టోరల్ రోల్స్ అప్‌డేషన్‌లను సమీక్షించడానికి సమావేశాన్ని నిర్వహించింది.

    ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక 

    అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల (డీఈఓలు)కోసం ఈసీ నిర్వహించే రెండు రోజుల వర్క్‌షాప్‌ను షెడ్యూల్ చేయాలని సీఈవోను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల (ఆర్‌ఓ)ల సమగ్ర జాబితాను సిద్ధం చేసి అప్‌డేట్ చేయాలని సీఈవోను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సరఫరా చేసిన ఈవీఎంలను ఇప్పటికే పరీక్షల అనంతరం జిల్లాల్లో ఉంచినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులకు పటిష్టమైన శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ఈసీ సీనియర్ స్థాయి అధికారులు ఆదేశించారు. పోలింగ్ శాతం పెంచడానికి మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు సీఈఓకు విజ్ఞప్తి చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికలు
    ఎన్నికల సంఘం
    తాజా వార్తలు

    తెలంగాణ

    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు హైదరాబాద్

    అసెంబ్లీ ఎన్నికలు

     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక

    ఎన్నికలు

    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ కర్ణాటక
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కర్ణాటక
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్

    ఎన్నికల సంఘం

    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం వృద్ధాప్యం
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు

    తాజా వార్తలు

    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కరోనా కొత్త కేసులు
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  మహారాష్ట్ర
    గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి'  ట్విట్టర్
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  ఆంధ్రప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023