
వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
సస్పెన్షన్ వేటు వేసిన వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
వైసీపీ
ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు: సజ్జల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తమ అంతర్గత దర్యాప్తులో తేలిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఒక్కో ఎమ్మెల్యేను రూ.10కోట్లను రూ.15కోట్ల వరకు చెల్లించి చంద్రబాబు వారిని కొనుగోలు చేసినట్లు సజ్జల చెప్పారు.
సస్పెన్షన్ వేటుపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తాము క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని చెప్పారు.
మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ.. వైసీపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.