ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించి సంచలనం సృషించారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. మరోవైపు టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయినా టీడీపీ తమ అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సాయంతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీడీపీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అంతా ఊహించారు. అయితే అనుకున్నట్లుగా జరిగింది. దీంతో సంచలనం ఫలితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది. టీడీపీ అభ్యర్థి అనురాధకు 23కు మంచి ఓట్లు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డితో మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓట వేసినట్లు అధికార పార్టీ అనుమానిస్తోంది.