Page Loader
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వే సంస్థలే జగన్‌ను తప్పుదారి పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాపం సర్వే సంస్థలదనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారట. 2019 ఎన్నికల సమయంలో నియమించుకున్న సర్వే సంస్థలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కొనసాగిస్తున్నారు. అవి రాష్ట్రంలో వచ్చిన స్థానిక, ఉప ఎన్నికలతో పాటు సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నాడిని ఎప్పుటికప్పుడు జగన్ నివేదిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇచ్చిన అన్నిరిపోర్టులను ఆయా సర్వే సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినట్లు సమాచారం. రిపోర్టులకు అనుగునంగానే అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

సీఎం జగన్

నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోలేదా?

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే సంస్థలు రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పడంతో, ఆ రిపోర్టులను చూసిన జగన్, ఇంట్లో ఉండి కూడా గెలువచ్చని అనుకుంటున్నట్లు సమాచారం. విచిత్రమేమంటే ఎగ్జిట్‌పోల్స్ కూడా 65శాతం ఓట్లతో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. సర్వే సంస్థలను గుడ్డిగా నమ్మడం వల్లే, పార్టీకీ కంచుకోటగా చెప్పుకునే రాయలసీమ జిల్లాల్లో జగన్ ఓటమి పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజమైన ఓటర్ల నుంచి శాంపిల్స్ తీసుకోకుండా, తూతూమంత్రంగా సర్వే చేసి, జగన్‌ను తప్పుదారి సర్వే సంస్థలు పక్కదారి పట్టించినట్లు వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు.