చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరినట్లు గిరిధర్ రెడ్డి తెలిపారు.
గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా నెల్లూరు నగరంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు.
గిరిధర్ రెడ్డి
వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి
ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించిన ఆయన, భారీ ర్యాలీతో తాడేపల్లికి వెళ్లి అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు.
గిరిధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
గిరిధర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.