ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ పోస్టులను దశల వారీగా చేపట్టినటు మంత్రి బొత్స అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది? అనే దానిపై నివేదిక సిద్ధమవుతోందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వివరించారు.
అసెంబ్లీలో టీచర్ల వయెపరిమితి బిల్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం టీచర్ల వయెపరిమితిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్య(సవరణ)-2023 బిల్లును బొత్స ప్రవేశపెట్టారు. అయితే ఈ అంశంపై సభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ, మంత్రి బొత్స మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలో టీచర్ల వయెపరిమితిని పెంచాలా? వద్దా? అనేది మీరే చెప్పాలని ఎమ్మెల్సీలను మంత్రి బొత్స అడిగారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీని ప్రకటించి, పోస్టులను నింపలేదని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు