
అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.
మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షాతో సంజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించున్నది.
ఇద్దరు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా మాట్లాడుకున్నారు.
అమిత్ షాతో భేటీ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మరింత ఉత్సాహంతో పని చేయాలని షా తనను కోరినట్లు చెప్పారు.
తాము అనేక తెలంగాణ సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవాలని అమిత్ షా తనకు సూచించినట్లు సంజయ్ పేర్కొన్నారు.
సమావేశానికి సంబంధించిన వివరాలను అమిత్ షా ట్విట్టర్‌లో తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమిత్ షాతో బండి సంజయ్ భేటీ దృశ్యాలు
Met Shri @bandisanjay_bjp Ji and discussed various issues related to Telangana. pic.twitter.com/APEvx6nA6w
— Amit Shah (@AmitShah) July 24, 2023