Page Loader
టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక 
టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక

టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు. టర్కీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడగ ఎర్డోగాన్ తిరుగులేని విజయాన్ని అందుకుకున్నారు. తయ్యిప్ ఎర్డోగాన్‌ 52.14 శాతం ఓట్లను సాధించగా, తన ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లుకు 47.86 శాతం ఓట్లు వచ్చాయి. ప్రధాన మంత్రిగా, అధ్యక్షుడిగా రెండు దశాబ్దాల పాటు టర్కీని పాలించిన ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు. తద్వారా ఎర్డోగాన్ పాలన మూడో దశాబ్దంలోకి ప్రవేశించింది. 2028వరకు టర్కీకి తయ్యిప్ ఎర్డోగాన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

టర్కీ

టర్కీ రిపబ్లిక్‌ 100వ వసంతం 

ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత టర్కీ రిపబ్లిక్‌ ఏర్పడి 100వ వసంతం జరుపుకుంటున్న వేళ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. మెజారిటీ ప్రజలు తమ దైనందిన జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, అలాగే భావప్రకటన స్వేచ్ఛను అణిచివేసినప్పటికీ, పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లి ప్రజలను తనకు ఓటు వేయమని ఎర్డోగాన్ ఎలా ఒప్పించారనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎర్డోగాన్‌ అనేక సవాళ్లు ఎదుర్కోనున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుంతోంది. టర్కీ కరెన్సీ విలువ భారీగా పడిపోవడం, విదేశీ మారక నిల్వలను క్షీణించడం, మరోవైపు భూకంపాలు బెడదలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి.