
అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.
తాజాగా కర్ణాటక పాల రైతులకు మద్దతునిస్తూ బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (బీబీహెచ్ఏ) అమూల్ ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నుంచి వచ్చే నందిని పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని తీర్మానం చేశారు.
బెంగళూరు మార్కెట్‌లో పాలు, పెరుగులను ప్రవేశపెట్టాలని గుజరాత్‌లో అమూల్ ప్రధాన కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది.
బెంగళూరు
కర్ణాటకకు గర్వకారణమైన నందిని పాలకు అందరం మనం మద్దతివ్వాలి: కేఎంఎఫ్
బెంగళూరులోని హోటళ్లలో రోజుకు 4 లక్షల లీటర్ల పాలు, 40,000-50,000 లీటర్ల పెరుగు వినియోగిస్తున్నట్లు బీబీహెచ్ఏ ప్రెసిడెంట్ పీసీ రావు తెలిపారు.
కేఎంఎఫ్‌కు పాలు సరఫరా చేసే అనేక మంది మహిళా రైతులు ఉన్నారని, హోటళ్ల వ్యాపారులే కాదు, కర్నాటక రైతులు, మహిళా రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక కారకంగా నందినికి మద్దతు ఇవ్వాలని పీసీ రావు కోరారు. కర్ణాటకకు గర్వకారణమైన నందిని పాలకు అందరం మనం మద్దతివ్వాలని వేడుకున్నారు.
భారతీయ ఉత్పత్తి అయిన అమూల్‌పై కర్ణాటక మిల్క్ అసోసియేషన్‌కు ఎలాంటి పక్షపాతం లేదని రావు అన్నారు.
అమూల్ పాల ధర లీటరుకు రూ. 54, అయితే నందిని నారింజ పాలు రూ. 43 మాత్రమే అన్నారు.