Page Loader
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు

PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు

వ్రాసిన వారు Stalin
Aug 15, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది. 1. చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు వచ్చేనెల నుంచి 'విశ్వకర్మ పథకం'ను ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని మోదీ ఈ ప్రకటన చేశారు. మొదటి విడతగా రూ.13,000 నుంచి రూ.15,000 కోట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. 2. జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000నుంచి 25,000కు పెంచాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని మోదీ తెలిపారు. అందుబాటు ధరలో జనరిక్ మందులను అందుబాటులో ఉంచేందుకు 'జన్ ఔషధి కేంద్రాలు' ఏర్పాటు చేశారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ.100విలువైన మందులు రూ.10-15కి ఇవ్వబడతాయి.

మోదీ

సొంత కలను నెరవేర్చేందుకు కొత్త పథకం

3. నగరాల్లో సొంత ఇల్లు కావాలని కలలు కంటున్న వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించనుందని ప్రధాని ప్రకటించారు. సొంతిల్లు లేని, పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా బ్యాంకు రుణాలను కూడా అందించున్నారు. 4. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ప్రజలపై ధరల పెరుగుదల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో తమ ప్రభుత్వం కొంత విజయాన్ని సాధించిందని అన్నారు. 5. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ఒకటిగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. 2014లో తాను ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం 10వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు.