ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే: వార్తలు

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.

Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే

తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.

తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!

తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.

ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ

ఏఐఏడీఎంకే‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు, పార్టీ మాజీ నేత వీకే శశికళ స్పందించారు. అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తానని చెప్పారు.