Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.
ఐటి వింగ్ చీఫ్ సీఆర్‌టీ నిర్మల్ కుమార్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఏఐఏడీఎంకేలో చేరిన నేపథ్యంలో ఇరు పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. . ఏఐఏడీఎంకే 'సంకీర్ణ ధర్మాన్ని' ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ టుటికోరిన్‌లో పలువురు బీజేపీ సభ్యులు అన్నాడీఎంకే అధినేత ఇ పళనిస్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని ప్రచారం జరిగిన నేపథ్యంలో జయకుమార్ క్లారిటీ ఇచ్చారు.
జయకుమార్
చిన్న చిన్న సమస్యలు పరిష్కరించబడతాయి: జయకుమార్
ఒకే కూటమిలో ఉన్నా, పార్టీలు మారడం సహజమేనని జయకుమార్ పేర్కొన్నారు. గతంలో కూడా ఏఐఏడీఎంకే మాజీ మంత్రి నైనార్ నాగేంద్రన్‌తో సహా పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించబడతాయని జయకుమార్ స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై కూడా ఈ అంశం స్పదించారు. ఈ అంశాలు ప్రభావం చూపవని అన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు పెట్టుకుని వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కూటమి ఓటమి పాలైంది. ఇటీవల రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. ఉప ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ప్రచారం కూడా చేయలేదు.