తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.
తాజాగా బీజేపీకి చెందిన 13మంది కీలన నేతలు ఏఐఏడీఎంకేలో చేరడంతో ఇరు పార్టీ మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి.
గత ఆదివారం రాష్ట్ర బీజేపీ ఐటీ చీఫ్ నిర్మల్ కుమార్ సహా ఐదుగురు నేతలు అన్నాడీఎంకేలో చేరారు. అంతకుముందు పలువురు అన్నాడీఎంకే నేతలు బీజేపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీలు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాయి.
తాజాగా చేరికలతో అన్నాడీఎంకేపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.
తమిళనాడు
ఉప ఎన్నికల్లో కలిసి ప్రచారం కూడా చేయని ఇరు పార్టీల నేతలు
2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు పెట్టుకుని వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కూటమి ఓటమి పాలైంది. ఇటీవల రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. ఉప ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ప్రచారం కూడా చేయలేదు.
హోంమంత్రి అమిత్ షా చివరి సారి రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు కూడా అన్నాడీఎంకే చీఫ్‌ను కలవలేదు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు ఏఐఏడీఎంకేలో చేరడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఘాటుగా స్పందించారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుతున్నందునే పళనిస్వామి కూటమిని బలహీనపరిచారని అన్నారు.