'యూనిఫాం సివిల్ కోడ్' అమలుకు మేం వ్యతిరేకం: ఏఐఏడీఎంకే
తమిళనాడులోని బీజేపీకి మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే కీలక ప్రకటన చేసింది. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను వ్యతిరేకిస్తూ, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి షాక్ తగిలింది. యూసీసీ భారతదేశంలోని మైనారిటీ వర్గాల మత స్వేచ్ఛకు హాని కలిగిస్తుందని ఏఐఏడీఎంకే విశ్వసిస్తోంది. యూనిఫాం సివిల్ కోడ్ రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు తీసుకురావద్దని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్‌పై తమ వైఖరి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నదే, ఇప్పుడు చెబుతున్నట్లు వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా, 'యూసీసీ' చర్చనీయాంశంగా ఉంది. ఇటీవల మోదీ యూసీసీపై మాట్లాడటంతో మరోసారి ఈ అంశానికి ప్రాముఖ్యత పెరిగింది.