Page Loader
దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం
దిల్లీలో బావిలాగా కుంగిన రోడ్డు

దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 05, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. ఆ రోడ్డు నిత్యం బిజీగా ఉంటుంది. అక్కడ వాహనాల రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. అలాంటి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై బావిలా ఓ పెద్ద గుంత ఏర్పడి కలవరపెడుతోంది. దిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు కుంగిపోయింది. వాహనాల రద్దీ ప్రారంభం కాకముందే ఈ ఘటనను గుర్తించగలిగారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టైంది. ప్రస్తుతానికి వన్ వేలో మాత్రమే వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఉంది. రెండో వైపు గుంతను పూడ్చేందుకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 దిల్లీలో కుంగిపోయిన రోడ్డు