తదుపరి వార్తా కథనం
Bhartha Mahasayulaku Wignyapthi: ఆషికా-డింపుల్‌తో రవితేజ మాస్ స్టెప్పులు - 'వామ్మో.. వాయ్యో..' లిరికల్ సాంగ్ రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 02, 2026
05:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా 'వామ్మో.. వాయ్యో..' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించగా, దేవ్ పవార్ సాహిత్యం సమకూర్చారు. స్వాతిరెడ్డి తన స్వరంతో ఈ పాటను ఆలపించారు.