Page Loader
ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు
6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపిన ఓటింగ్ ఫలితాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘోషి, ఝార్ఖండ్‌లోని దుమ్రి, ధన్‌పూర్, త్రిపురలోని బక్సానగర్, కేరళలోని పుథుప్పల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, పశ్చిమబెంగాల్‌లోని ధుప్‌గురిలో ఉపపోరు జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు అభ్యర్థులతో సహా ఆయా పార్టీలు కౌంటింగ్ కేంద్రాల్లో బీజీబీజీగా గడుపుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పశ్చిమ బెంగాల్ లోని ధుప్‌గురి ఓట్ల కౌంటింగ్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేరళలోని పుథుప్పల్లిలో ఉపఎన్నికల ఫలితాల లెక్కింపు