Page Loader
కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు 
కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు

కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జగదీష్ షెట్టర్‌కు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను కర్ణాటక బీజేపీని నిర్మించినట్లు చెప్పారు. అయితే తనలాంటి సీనియర్ నాయకులను బీజేపీ విస్మరించిందన్నారు.

కర్ణాటక

నేను ఏడోసారి కూడా మంచి మెజార్టీతో గెలుస్తా: జగదీష్ షెట్టర్‌

తాను ఎప్పుడూ బీజేపీ నుంచి రికార్డ్ మెజార్టీతో గెలుస్తూ వచ్చినట్లు గుర్తు చేశారు. బీజీపే సీనియర్ నేతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని జగదీష్ షెట్టర్‌ మండిపడ్డారు. కాషాయ పార్టీ టికెట్‌ దక్కకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. తాను ఏడోసారి హుబ్బలి-ధార్వాడ్‌లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రణ్‌దీప్ సుర్జావాలా ట్వీట్