NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 
    తదుపరి వార్తా కథనం
    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 
    స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటే 2,90,000 సంతకాలు అవసరం

    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 

    వ్రాసిన వారు Stalin
    Aug 28, 2023
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తైవాన్ అధ్యక్ష పదవికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ సోమవారం ప్రకటించారు.

    వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

    తైవాన్‌కు నాయకుడిగా ఎదగాలని టెర్రీ గౌ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి తైవాన్‌లోని ప్రతిపక్ష కోమింటాంగ్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా పోటీ చేయాలని టెర్రీ గౌ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు.

    2019లో కూడా టెర్రీ గౌ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    ఎన్నికల్లో పోటీ చేసేందుకు టెర్రీ గౌ 2019లో ఫాక్స్‌కాన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

    తైవాన్ 

    స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటే 2,90,000 సంతకాలు అవసరం

    ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో టెర్రీ గౌ మాట్లాడారు. తనకు అధ్యక్షుడిగా ఈ సారి అవకాశం ఇవ్వాలని తైవాన్ ప్రజలను టెర్రీ గౌ కోరారు.

    తనను గెలిపిస్తే తైవాన్ ద్వీపంలో వచ్చే యాభై సంవత్సరాల పాటు శాంతిని పునరుద్ధరిస్తానని టెర్రీ గౌ స్పష్టం చేశారు.

    టెర్రీ గౌ స్వతంత్ర అభ్యర్థిగా అర్హత సాధించడానికి నవంబర్ 2 నాటికి 2,90,000 సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రచారకార్యక్రమాన్ని సైతం మొదలు పెట్టారు.

    తైవాన్‌ను చైనా తన భూభాగంగా పరిగణిస్తుంది. బలవంతంగా తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

    అయితే తైవాన్‌పై చైనా ఆధిపత్యాన్ని గౌ వ్యతిరేకిస్తున్నారు. తైవాన్ ప్రస్తుత అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్ రెండు దఫాలు ఎన్నికల్లో గెలిచి ఏడేళ్లుగా అధికారంలో ఉన్నారు.

    తైవాన్

    టెర్రీ గౌను చైనా ఏజెంట్ అంటూ విమర్శలు

    2016‌లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి త్సాయ్ ఇంగ్-వెన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తైవాన్‌పై చైనా అధిపత్యం పెరిగిన విషయం తెలిసిందే.

    డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఏడేళ్ల పాలన తైవాన్‌కు యుద్ధ ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని గౌ విమర్శించారు. తైవాన్‌ను తదుపరి ఉక్రెయిన్‌గా ఎప్పటికీ అనుమతించబోనని అతను స్పష్టం చేశాడు.

    అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం టెర్రీ గౌను చైనా ఏజెంట్‌గా చెబుతున్నారు.

    ఫాక్స్‌కాన్ చైనాలో భారీ ఫ్యాక్టరీలను నిర్మించింది. బీజింగ్‌లోని నాయకత్వంతో అతనికి సన్నిహత సంబంధాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. అయితే టెర్రీ గౌ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

    తాను తాను నాలుగేళ్లుగా ఫాక్స్‌కాన్ నిర్వహణలో పాలుపంచుకోవడం లేదని గౌ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికలు
    చైనా
    ఆపిల్

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ

    చైనా

    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  భారతదేశం
    షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా  అంతరిక్షం
    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా  భారతదేశం
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా  భారతదేశం

    ఆపిల్

    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ టెక్నాలజీ
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ధర
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ భారతదేశం
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025