2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్
2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'ఇండియా'లోని 26 ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2014లో బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు. మిగిలిన 69 శాతం ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయని స్పష్టం చేశారు. పూర్తి మెజార్టీ లేని ప్రధాని అహంకారంతో ఉండకూడదని గెహ్లాట్ అన్నారు. జులైలో బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష 'ఇండియా' కూటమి సమావేశం ఎన్డీయేను భయపెట్టిందన్నారు.
ఎన్డీయేకు 50శాతం ఓట్లు రావడం అసాధ్యం: అశోక్ గెహ్లాట్
2024 లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో అధికారం సాధించేందుకు ఎన్‌డీఏ కృషి చేస్తోందన్న వాదనలను అశోక్ గెహ్లాట్ తోసిపుచ్చారు. 50శాతం ఓట్లను ప్రధాని ఎప్పటికీ సాధించలేరన్నారు. 2024 ఎన్నికల్లో మోదీకి ఓట్ల శాతం తగ్గుందన్నారు. చంద్రయాన్-3 గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇస్రోను స్థాపించారని గుర్తు చేశారు. ఇస్రో లేకపోతే చంద్రయాన్ ఎలా జరిగేదన్నారు. పండిట్ నెహ్రూ వేసిన పునాదితోనే నేడు దేశం ముందుకు సాగుతోందన్నారు. శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ సూచనను నెహ్రూ విన్నందున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించబడిందని ఆయన అన్నారు. అంతరిక్ష కేంద్రం పేరు అప్పట్లో వేరే ఉండేదని, ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్రోగా మార్చారని అన్నారు.