Page Loader
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే
భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను నియమించామని వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకానికి ఎన్నికలను నిర్వహించాలని ఐఓఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను చేపట్టాలని జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ ను కోరినట్లు తెలిపింది.

Details

కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్న భారత ఒలింపిక్ సంఘం 

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అసిస్టెంట్ రిటర్నింగ్‌ అధికారితో పాటు మరికొంత మంది సిబ్బంది తోడుగా ఉంటారని జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌కు రాసిన లేఖలో ఐఓఏ పేర్కొంది. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్‌ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు భారత ఒలింపిక్ సంఘం ఎన్నికకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే గురువారంలోగా దిల్లీ ట్రయల్‌ కోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో దేశ రాజధాని ( ఎన్సీటీ ) దిల్లీ పోలీసులు దర్యాప్తును వేగం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిజ్‌ భూషణ్‌ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించారు.