రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది. 2021-22ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.2,172కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇది వారి మొత్తం ఆదాయంలో 66.04శాతంగా ఉందని వివరించింది ప్రధానంగా ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీ వార్షిక ఆడిట్ నివేదికలో విరాళాలు ఎవరు ఇచ్చారో వెల్లడించకుండానే ఆదాయాలను ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్‌లు, కూపన్‌ల విక్రయం, రిలీఫ్ ఫండ్‌లు, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.
అజ్ఞాత విరాళాల్లో 53.45 శాతంతో బీజేపీనే టాప్
అజ్ఞాత వ్యక్తులు పార్టీలకు పంపిన మొత్తం విరాళాల్లో రూ.1,811.94కోట్లు లేదా 83.41శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలు రూ.690.67కోట్లుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు రూ. 20,000కంటే తక్కువ విరాళం ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేర్లను, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చే వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. అందుకే వార్షిక నివేదికలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించలేదని ఏడీఆర్ చెప్పింది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.1,161కోట్ల విరాళాలు వచ్చినట్లు బీజేపీ ప్రకటించింది. మొత్తంలో ఇది 53.45శాతం. రెండోస్థానంలో రూ.528కోట్లతో(24.31శాతం) రెండోస్థానంలో ఉంది.