Page Loader
బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!

బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది. 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకున్న జేడీఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అధికార బీజేపీని గద్దె దించి, కింగ్‌మేకర్‌ కావాలన్న జేడీఎస్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. జేడీఎస్ 224 సీట్లలో కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. తద్వారా గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు బాగా తగ్గాయి.

కర్ణాటక

ఒడిశా రైలు ప్రమదం విషయంపై రైల్వే మంత్రికి అండగా దేవేగౌడ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఓటు బేస్‌ను కాపాడుకునేందుకు దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్, బీజేపీతో జతకట్టే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ వైపు జేడీఎస్ మొగ్గు చూపుతున్నట్లు చెప్పడానికి పలు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం తరువాత ప్రతిపక్ష పార్టీలు రైల్వే మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, దేవెగౌడ మాత్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను గట్టిగా సమర్థించారు. అలాగే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ఇతర ప్రతిపక్ష నేతలు బహిష్కరిస్తే, దేవెగౌడ హాజరయ్యారు. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి విషయంలో కూడా ఎన్టీఏకు మద్దతుగానే దేవేగౌడ మాట్లాడారు. దీంతో సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ-జేడీఎస్ కలిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.