Page Loader
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ

రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 

వ్రాసిన వారు Stalin
Jul 03, 2023
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్‌లైన్ మోడ్‌లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను సోమవారం ప్రారంభించినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల కమిషన్ మూడు రకాల నివేదికలను దాఖలు చేయడానికి వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. రాజకీయ పార్టీల కంట్రిబ్యూషన్ రిపోర్ట్, ఆడిట్ చేసిన వార్షిక ఖాతా, ఎన్నికల వ్యయ ప్రకటనలకు సంబంధించిన నివేదికలను పోర్టల్‌లో సమర్పించడానికి అవకాశం కల్పించింది. రెండు లక్ష్యాలతో కొత్త వెబ్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు ఎన్నికల కమిషన్ చెప్పింది. ఒకటి భౌతికంగా నివేదికలను దాఖలు చేయడంలో ఇబ్బందులను అధిగమించడం, రెండోది ప్రామాణికంగా సకాలంలో దాఖలు చేసేందుకు ఈ వెబ్ పోర్టల్‌ ఉపయోగపడుతుందని ఈసీ భావిస్తోంది.

ఈసీ

ఆన్‌లైన్ పోర్టల్ వినియోగాన్ని వివరించేందుకు ప్రత్యేక శిక్షణ

ఆన్‌లైన్ పోర్టల్ వినియోగాన్ని వివరించేందుకు ఎన్నికల సంఘం శిక్షణా సెషన్‌లను నిర్వహించనుంది. ఈ పరిణామం రాజకీయ పార్టీలు వెల్లడించే ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకొస్తుందని ఈసీ భావిస్తోంది. ఈసీ తీసుకున్న ఈ చర్యను పోల్ ప్యానెల్‌లోని 3సీ వ్యూహంలో ఒక భాగమే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నిధులు, వ్యయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈసీఐ ఏడాది పాటు దీనిపై కసరత్తు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. ఆన్‌లైన్ మోడ్‌ను ఉపయోగించని పార్టీలు అలా చేయడానికి కారణాలను తెలియజేయాలయని ఈసీ తెలిపింది.