Page Loader
నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్‌.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం
రేపు కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం

నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్‌.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం అందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని యువ ఓట‌ర్లను చైత‌న్యవంతులను చేసేందుకు ప్రముఖ క్రికెట్ ఆటగాడు స‌చిన్ టెండూల్క‌ర్‌ను ఎంచుకోనుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒప్పందం చేసుకోనుంది. రానున్న మూడేళ్ల పాటు స‌చిన్ ప్ర‌జ‌లను ఓటు హక్కు వినియోగించుకోవడంపై విస్త్రృతంగా ప్ర‌చారం నిర్వ‌హించనున్నారు. ఈ క్రమంలోనే అతడ్ని నేష‌న‌ల్ ఐకాన్‌గా సీఈసీ గుర్తించనుంది. ఎన్నిక‌లపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌నను పెంపొందించేందుకు ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ ను నేష‌న‌ల్ ఐకాన్‌గా నియామకం చేయనుంది.

details

ప్రసిద్ధ వ్యక్తులను నేషనల్ ఐకాన్స్‌గా నియమిస్తోన్న సీఈసీ

2024లో సార్వత్రిక ఎన్నిక‌లు జరగనున్నాయి. లోక్ సభకు దేశవ్యాప్తంగా దఫాలుగా పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగానే స‌చిన్ టెండూల్కర్ ఓట‌ర్ చైత‌న్య ప్ర‌చార కార్యక్రమాలను చేపడతారని సీఈసీ వెల్లడించింది. మరోవైపు పలు రంగాల‌కు చెందిన ప్రసిద్ధ వ్యక్తులను, నేష‌న‌ల్ ఐకాన్స్‌గా సీఈసీ నియమిస్తోంది. ఈ మేరకు వారిని ఆయా ప్ర‌చారాల కోసం వినియోగించనుంది. గ‌తంలో పంక‌జ్ త్రిపాఠి, మరో క్రికెట్ లెెజెండరీ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్‌, బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్‌ల‌ను ఎన్నిక‌ల్లో ఓటు హక్కు ప్ర‌చార నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం విధులు అప్పగించింది.