
Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ(ELECTION COMMISSION) ఓటర్ల జాబితాను ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారీగా ఓటర్లు పెరిగినట్లు వివరించారు.
సాధారణంగా ఏటా జనవరి 5న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. గత జనవరితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 6,64,674 మంది ఓటర్లు తమ ఓటు కోసం నమోదు చేసుకున్నట్లు ఈసీ తెలిపింది.
జాబితాలో పేరు లేని వారు 15 రోజుల్లోగా ఫారం 6తో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
details
64నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఈసీ చెప్పింది. మొత్తం 119 నియోజకవర్గాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,06,42,333 మంది ఓటర్లలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు ఉన్నారు.
2,133 మంది ఇతరులు ఉండగా, 15,337 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య తొలిసారిగా 4,76,597మంది ఓటరుగా నమోదయ్యారు. అక్టోబరు 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని 15 స్థానాల పరిధిలో మొత్తం 40,30,989మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 22,09,972 మంది, మహిళా ఓటర్లు 20,90,727 మంది ఉన్నారు. ఇతర ఓట్లు 290గా ఉన్నాయి. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.