LOADING...
Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 
ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు

Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 

వ్రాసిన వారు Stalin
Aug 21, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్‌అధికారి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌వేటు వేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవవహారంలో తాజాగా ఈసీ మరో అధికారిని సస్పెండ్ చేసింది. భాస్కర్‌రెడ్డికి ముందు సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణిపై సస్పెన్షన్‌వేటు పడింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు ఈసీ విచారణ చేపట్టింది. తన నియోజకవర్గంలో దాదాపు 6వేల బోగస్ ఓట్లను చేర్చడంతో పాటు దాదాపు 2వేలకు పైగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి భాస్కరరెడ్డి కారణమని కేశవ్ ఆరోపించారు.

కేశవ్

భాస్కర్ రెడ్డిపై మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేసిన పయ్యావుల కేశవ్ 

ఓటరు జాబితా తయారీలో జరిగిన అవకతవకలు జరిగాయంటూ గత ఆరు నెలలుగా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)తో సహా వివిధ స్థాయిల్లో పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. దీంతో ఆయన నేరుగా కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కేశవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న పొరపాట్లకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు తహసీల్దార్లు, మరికొందరు వీఆర్వోలను సస్పెండ్ చేసింది. అయితే రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈవో భాస్కరరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశవ మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేశారు.