
6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.
జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
అయితే ఈ ఉప ఎన్నికలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. '
'ఇండియా' కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
దీంతో 'ఇండియా' కూటమికి ఈ ఉప ఎన్నికలు మొదటి పరీక్షగా విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోలింగ్ జరుగుతున్న దృశ్యం
#WATCH | Jalpaiguri, West Bengal: Voting for Dhupguri Assembly by-polls to begin shortly pic.twitter.com/K3MeBk0NzF
— ANI (@ANI) September 5, 2023